జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో తడపాకల్ గ్రామంలో జై బాపు,జై భీం,జై సంవిధాన్ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించి కరపత్రాలు పంచుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడిని ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు.అలాగే తడపాకల్ గ్రామానికి అడిగినన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి...