Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 3:53 pm Posted by : ramakrishna

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో తడపాకల్ గ్రామంలో జై బాపు,జై భీం,జై సంవిధాన్ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించి కరపత్రాలు పంచుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడిని ప్రజలకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు.అలాగే తడపాకల్ గ్రామానికి అడిగినన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేపడుతానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్  ముత్యాల సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఆరు లక్షల రూపాయలు నిధులతో వేయబోయే సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఇట్టి కార్యక్రమం బట్టపూర్ నుండి ఏర్గట్ల మండల కేంద్రానికి చేరుకొని జై బాపు,జై భీమ్,జై సంవిధాన్, ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దేవరెడ్డి,ఏర్గట్ల గ్రామ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్,డిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగ ప్రసాద్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు ముస్కు మోహన్ రెడ్డి,జింక అనిల్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మునీర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బద్దం లింగారెడ్డి,బెజ్జారపు భాను, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలుపాల్గొన్నారు.