Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 9:30 pm Posted by : ramakrishna

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం

బతుకమ్మ,వేల్పూర్:- మండల కేంద్రాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ ప్రజల హక్కులను కాల రాస్తుందని తెలిపారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఈ పోరాటంలో ప్రజలందరూ కలసిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి శాసన సభలో చట్టం చేసిందని ఎస్సీ ఉపకులల వర్గీకరణ చేసిందని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.