రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్

డోంకేశ్వర్, బతుకమ్మ : రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గురువారం డోంకేశ్వర్ మండలం లోని తొండకూర్, దత్తాపూర్ గ్రామాల్లో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ కోసం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరచే ప్రయత్నాలు చేస్తోందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా రావాల్సిన అవసరం ఉందని...