Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 4:22 pm Posted by : ramakrishna

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సమావేశం

బతుకమ్మ, ఏర్గట్ల: ఏఐసీసీ,పీసీసీ, ఆదేశాల మేరకు ఏర్గట్ల మండల కేంద్రంలో జై బాపు,జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌’ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ హాజరై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అభియాన్, పేరుతో ప్రతి గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనాన్ని కరపత్రాల ద్వారా పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి,టీజీ ఎమ్ డి సి చైర్మన్ ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్,మాజీ జెడ్ పి టిసి గుల్లే రాజేశ్వర్, మండల పార్టీ అధ్యక్షుడు దేవరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగ ప్రసాద్, ఏఎంసి చైర్మన్ పాలెపు నరసయ్య,డైరెక్టర్ కోరిపెళ్లి లింగారెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, సున్నపు అంజయ్య, రేండ్ల రమేష్,ఎండి మునీరుద్దీన్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్,రవి రెడ్డి, బలే శ్రీనివాస్,రోక్కెడ సంజీవ్,సంసాన్,దొబ్బల మహేష్,అజయ్,రఫీ,కైలాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.