Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 7:20 pm Posted by : ramakrishna

జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ కార్యక్రమం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం కేంద్రంలోని పద్మశాలి సంఘంలొ జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, కార్యక్రమ పర్యవేక్షకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరచాలని చూస్తుందని ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందని రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం పిలుపుతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Jai Bapu.. Jai Bheem.. Jai Samvidhan program