మట్టి గణపతికి రాఖీలు కట్టి భక్తిని చాటిన జాగృతి అభ్యుదయ సంఘం హరిత సైన్యం
హైదరాబాద్, బతుకమ్మ : ఈ నెలలో రానున్న వినాయక చతుర్థిని పురస్కరించుకుని జాగృతి అభ్యుదయ సంఘం హరిత సైన్యం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వర్షాకాలం ఆగష్టు నెలలో కూడా రోహిణి కార్తెను తలపించే ఎండలు కాస్తూ చెమటలు పడుతూ, విపరీతమైన ఉక్కపోత వాతావరణాన్ని భరించలేకున్నామని, తమవంతు బాధ్యతగా తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాతావరణ సమతుల్యతకు తామంతా పూనుకుంటామని, ఈ సంవత్సరం వినాయక చవితిని పర్యావరణ ప్రియంగా జరుపుకుంటామని, మన సనాతన హిందూ సంప్రదాయం ఐన మట్టి గణపతిని మా ఇళ్ళలో...