Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 5:28 pm Posted by : ramakrishna

దేశ స్వాతంత్ర్య పోరాటంలో జగ్జీవన్ రాం సేవలు చిరస్మరణీయం

 

. . . టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, సామాజిక సమానత్వ సాధనలోనూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ అన్నారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి, సామాజిక న్యాయ సాధకుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా నాందేవాడ ఎస్సీ బాలుర వసతి గృహంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో విశిష్ట నాయకుడిగా ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతి, సమాన హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం, సమానత్వం, అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవిన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజు, టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా నాయకులు కొత్తపేట రమేష్, సాయి కామ్లే, ప్రకాష్ మాదిగతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.