జిల్లా వాసి రాజశేఖర్ కు జగ్జీవన్ రామ్ నేషనల్ అవార్డు

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని ఎడపల్లి మండల యువజన సంఘాల సమితి అధ్యక్షుడు జి రాజశేఖర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ(బీఎస్ఏ) జాతీయ కార్యాలయంలో రాజశేఖర్ కు అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్, బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధా కృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాధా కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ప్రజా...