Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 3:15 pm Posted by : ramakrishna

జిల్లా వాసి రాజశేఖర్ కు జగ్జీవన్ రామ్ నేషనల్ అవార్డు

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని ఎడపల్లి మండల యువజన సంఘాల సమితి అధ్యక్షుడు జి రాజశేఖర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ(బీఎస్ఏ) జాతీయ కార్యాలయంలో రాజశేఖర్ కు అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్, బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధా కృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాధా కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవార్డును అందజేస్తోందన్నారు. ఈనెల 15వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న బహుజన సాహిత్య అకాడమీ 5వ నేషనల్ కాన్ఫరెన్స్ లో రాజశేఖర్ కు అవార్డు అందజేయనున్నట్లు తెలిపారు. రాజశేఖర్ బాబు జగ్జీవన్ రామ్ నేషనల్ అవార్డుకు ఎంపికకావడంతో యుజవన సంఘాల ప్రతినిధులు, యువకులు హర్షం వ్యక్తం చేశారు.