. . . 22 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
జగిత్యాల, బతుకమ్మ :
జగిత్యాల జిల్లా రవాణా శాఖాధికారి బానోత్ భద్రు నాయక్ రూ.22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ ఎసిబి డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం కోరుట్లకు చెందిన జేసిబి యజమాని శశిధర్ నుంచి రూ 22 వేల లంచం ను తన డ్రైవర్ అరవింద్ ద్వార స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. ఇటివల జగిత్యాల ఆర్ టి ఓ భధ్రూనాయక్ సాధరణ తనిఖీలలో భాగంగా శశిధర్ కు సంబంధించిన జేసిబి, దానితో పాటు అతని సెల్ ఫోన్ సీజ్ చేశారు. పోన్ ఇవ్వాలని ఆర్ టి ఓ ను శశిధర్ సంప్రదించగా రూ.35 వేలు లంచం డిమాండ్ చేశారు. చివరకు డ్రైవర్ అరవింద్ ద్వార బేరాలాడి రూ.22 వేలు తీసుకుంటుండగా అవినితీ నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. భధ్రూనాయక్ తో పాటు అతని డ్రైవర్ ను అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరుస్తాం అని తెలిపారు. మరికోద్ధిరోజుల్లో పధవి విరమణ చేయాల్సిన భధ్రునాయక్ ఎంవిఐగా పనిచేసిన కాలంలో కరీం నగర్ లో, మహబూబాబాద్ లో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ ట్రాక్ రికార్డు ఉంది.