Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 5:58 pm Posted by : ramakrishna

నిజామాబాద్ పార్లమెంట్ సమావేశంలో జగిత్యాల కాంగ్రెస్ లోల్లి

 . . . సభ లేడ్జర్ బుక్కులో తన పేరు లేకపోవడంపై అలిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

. . . జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశంకు రావడంతో స్టేజీ దిగిన ఎమ్మెల్సీ

. . .  బ్రతిమాలి సభ లో కుర్చుండ బేట్టిన నేతలు

. . . పీసీసీ చీఫ్ సోంత ఇలాకాలో కాంగ్రెస్  సభ నిర్వహణ అస్థవ్యస్థ్యం

 నిజామాబాద్, బతుకమ్మ:

రాష్ట్ర పీసీసీ చీప్ బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ సోంత జిల్లా నిజామాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్థాయి సమావేశం రసభసగా సాగింది. కాంగ్రెస్ పార్టి రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీప్ దాస్ మున్షీతో పాటు పార్లమెంట్ పరిధిలోని  ఎమ్మెల్యేలు, కంటేస్టేడ్ క్యాండిడేట్ లతో పాటు వివిధ సంస్థల చైర్మెన్ లు హజరైన సభలో జగిత్యాల కాంగ్రెస్ తుపాన్ నిజామాబాద్ పార్లమెంట్ సమావేశంలో తీవ్ర వాయుగుండమై అలకలు, బుజ్జగింపులకు దారీ తీసింది.

Jagityala Congress lolli in Nizamabad Parliament meeting

నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమావేశం డిచ్ పల్లిలోని ఓక  ప్రైవేట్ పంక్షన్ హల్ లో  జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి క్రిష్ణ రావుతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు సుధర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలతో పాటు జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హజరయ్యారు. పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ విశిష్ట అతిథిగా  హజరైన నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ సమావేశంలో ఎమ్మెల్సీ( పార్లమెంట్ ఎన్నికలలో కంటేస్టేడ్ క్యాండిడేట్) టి. జీవన్ రెడ్డి అలిగారు. సభ లేడ్జ్ ర్ బుక్కులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పేరు కనపించకపోవడంతో ఆశ్చర్యపోయారు. అదే సమయంలో  లేడ్జ్ ర్ బుక్కులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసారు. సభకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రావడంతో స్టేజ్ దిగి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్లి పోయారు. అంతకు ముందు సభలోనే అసహనం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి. సంజయ్ ని ఎలా పిలుస్తారని సభ నిర్వాహకులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సభ నుండి వెళ్లిపోయిన జీవన్ రెడ్డిని బ్రతిమిలాడి సభ సభలో కూర్చుండబెట్టిన కాంగ్రెస్ నాయకులు. దానితో  పార్లమెంటరీ స్థాయి సభలో గందరగోళం ఎర్పడింది.

Jagityala Congress lolli in Nizamabad Parliament meeting