Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2025, 1:22 pm Posted by : ramakrishna

విజయసాయిరెడ్డిపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు

కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటు అమ్మేసుకున్నాడు

తాడేపల్లి , బతుకమ్మ : విజయసాయిరెడ్డిపై ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారన్నారు. కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటు అమ్మేసుకున్నారని విమర్శించారు. ఏపీలోని తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్ 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో సెక్రటేరియట్ నిర్మించారన్నారు.  చంద్రబాబు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి అని? ప్రశ్నించారు. ఇప్పటికే రూ.173 కోట్లతో కట్టి ఉన్న సచివాలయాన్ని గంగపాలు చేశారన్నారు.  అమరావతి పనుల కోసం 2018లో ఖరారైన టెండర్ల విలువ రూ.41,170 కోట్లు కాగా, చంద్రబాబు పూర్తి చేసిన పనులు మినహా రూ.35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉందన్నారు.  ఆ టెండర్లను రద్దు చేశారన్నారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేసి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.