జిల్లావ్యాప్తంగా ఏడు చోట్ల జగన్నాథ రథయాత్రలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్రం అధ్యక్షులు రామానంద రాయ్ గౌరదాస్ తెలిపారు. బుధవారం కంఠేశ్వర్ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూరి జగన్నాథ క్షేత్రంలో జరిగే రథయాత్రను ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మహిళలు, పురుషులు, యువత, చిన్నారులు సహా సమస్త భక్తజనులు పెద్ద సంఖ్యలో రథయాత్రల్లో పాల్గొని...