Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 9:25 pm Posted by : ramakrishna

జగమంత రామనామ స్మరణ.. ఘనంగా రథోత్సవం

ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి  గ్రామంలో శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి గ్రహాల ఊరేగింపు రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల మంది సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు.దేశంలోనే చరిత్ర కలిగిన రామాలయం దశబ్దల కాలం నుండి ప్రసిద్ధి చెందింది. వివరాల్లోకి వెళితే దేశంలోనే లక్ష్మణుడు లేని రామాలయంగా ప్రసిద్ధి చెందింది.సీతరామచంద్రుడు సీతమ్మవారి విగ్రహాలు మాత్రమే ఇందల్వాయి రామాలయం మందిరంలో ఉండడం ఒక చరిత్రగా చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం వారం రోజులపాటు రామాలయ మందిరంలో వివిధ రకాల అలంకరణలతో శ్రీరామనవమి వేడుకలను జరుపుతుంటారు. దీంతో ప్రజలు వివిధ గ్రామాల నుండి,మండలాల నుండి, జిల్లాల నుండి సైతం భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. స్థానిక ఎస్సై మనోజ్ కుమార్ పోలీస్ బందోబస్తును పకడ్బంది గా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు శనివారం రథోత్సవ ఊరేగింపు ఉండడంతో  భారీగా పూలంకరణలతో పాటు రామాలయ మందిరాన్ని  లైటింగ్ సిస్టం అలంకరణతో ముస్తాబు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామభివృద్ధి కమిటీ,గ్రామస్తులు, యువజన సంఘాలు, యువకులు,రాజకీయ నాయకులు,భారీ సంఖ్యలో ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు