Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 5:52 pm Posted by : ramakrishna

లంబాడీల ఐక్యవేదిక బిచ్కుంద మండల అధ్యక్షుడిగా జాదవ్ మానిక్

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల లంబాడీల ఐక్యవేదిక కమిటీ అధ్యక్షుడిగా జాదవ్ మాణిక్, ప్రధాన కార్యదర్శిగా పవర్ హరిలాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  అనంతరం నూతన కమిటీ సభ్యులకు రాష్ట్ర కోఆర్డినేటర్ కాట్రోత్ రవీందర్ నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా ఐక్యత కోసం, బంజరుల హక్కుల కోసం లంబాడీల ఐక్యవేదిక పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ శంకర్, జాదవ్ దన్ సింగ్, మోహన్, విజయ్, అరవింద్, మరియు తదితరులు పాల్గొన్నారు.

Jadhav Manik is the president of Bichkunda Mandal, the Lambadi United Forum