Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 8:59 pm Posted by : ramakrishna

చిట్టిలు( పైనాన్స్) కడితేనే సరి…. లేకపోతే వేదింపులే

 

. . . మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ జవాన్ వేదింపులు

 

. . . కమీషనర్ కు ఫిర్యాదు చేసిన పారిశుధ్య కార్మికురాలు

 

నిజామాబాద్ అర్బన్,  బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపాధికన జవాన్ గా పనిచేస్తున్న వ్యక్తి పారిశుధ్య సిబ్బందిని వేదిస్తున్న విషయం కమీషనర్ కు ఫిర్యాదు చేయడంతో వెలుగు లోకి వచ్చింది. తాను ప్రైవేట్ గా నిర్వహిస్తున్న చిట్స్ అండ్ పైనాన్స్ వ్యాపారంలో చిట్టిలు వేయాలని లేకపోతే వేదింపులు తప్పడం లేదని  బహుజన లెప్ట్ ప్రంట్ నాయకులు ఆరోపిస్తున్నారు.

 

It's okay if you pay the bills.... otherwise it's harassment.

 

ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఔట్ సోర్సింగ్ జవాన్ నందిని చిట్స్, గ్రూప్ ఫైనాన్స్ పేరుతో ఫైనాన్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటే అధికారులు నిమ్మకు నిరెత్తినట్టుగా వ్యవహారిస్తున్నారని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత అన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మున్సిపల్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ జవాన్ గా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నందిని చిట్స్, గ్రూప్ కంపెనీ ద్వారా ఫైనాన్స్ వ్యాపారాన్ని నడుపుతున్నతున్నందుకు అతన్ని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

 

It's okay if you pay the bills.... otherwise it's harassment.

 

అనంతరం లత మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ వ్యక్తులు నడిపే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారులపై జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాలతో అనేక మందిపై కేసులు నమోదు చేశారని అన్నారు. అలాగే కె. వెంకటస్వామి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ వ్యాపారాన్ని నడిపినందుకు ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల నుండి ఒక్కొక్కరి నుండి బలవంతంగా లక్షల రూపాయల చిట్టిలను కట్టాలని ఒత్తిడి చేస్తున్నాడని తెలిపారు. ఏప్రిల్ 18న సర్కిల్ 5 లో విధులు నిర్వహిస్తున్న పిల్లి కొండ లక్ష్మి అనే శానిటేషన్ కార్మికురాలు కె.వెంకటస్వామి వేధింపులపై ఫిర్యాదు చేస్తే ఇంత వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నందిని చిట్స్, గ్రూప్ ఫైనాన్స్ పేరుతో 2026 సంవత్సరపు క్యాలెండర్ వేసి అన్ని మున్సిపల్ సర్కిల్స్ కార్యాలయాల్లో తన ఫైనాన్స్ ని బహిరంగంగా ప్రచారం చేస్తున్న ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు.

 

It's okay if you pay the bills.... otherwise it's harassment.

 

ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, బిఎల్ టీయూ జిల్లా అధ్యక్షులు కాంబ్లె మధు, బిఎల్  టియు నగర అధ్యక్షులు యాటల అనిల్ కుమార్, బిఎల్ టియు నగర ఉపాధ్యక్షులు హైమద్ ఉసేన్ పాల్గొన్నారు.