Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 3:56 pm Posted by : ramakrishna

అది ఆక్సిడెంట్ కాదు.. మర్డర్

– నిందితులను పట్టించిన సెల్ ఫోన్

– సికింద్రాపూర్ కేసును ఛేదించిన పోలీసులు

– ముగ్గురిని అదుపులో కీ తీసుకున్న పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జాతీయ రహదారి 44పై జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద ఈనెల 3వ తేదీన డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లికి చెందిన రవీంద్రవర్మ(37) అనే వ్యక్తి మృతి చెందాడు. వర్మ ఆక్సిడెంట్ లో మరణించాడని అంతా అనుకుంటుండగా.. అది హత్య అని పోలీసులు తేల్చారు.

It's not an accident.. it's murder.

వివరాలు ఇలా ఉన్నాయి.. రవీంద్ర వర్మ ప్రముఖ ఎంఎన్ సీలో ఉద్యోగం చేసి మానేశాడు. ఇంటి వద్దే ఉంటూ వ్యాపారాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈనెల 3న మెట్ ల్లి వెళ్లి తిరిగి వస్తూ ఆర్మూర్ లోని వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి సొంతూరు వచ్చేందుకు వాహనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో కామారెడ్డి వైపు వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపి లిఫ్ట్ అడిగాడు. ఆ వాహనంలో ఉన్న వారు రవీంద్ర వర్మ వద్ద డబ్బులు, సెల్ ఫోన్ బ్యాగ్ ఉండడాన్ని గమనించి వాహనంలోకి ఎక్కించుకున్నారు.

జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ వద్దకు రాగానే కాలకృత్యాలు తీర్చుకుందాం అని వెహికల్ ఆపి కి కిందికి దిగారు. ఈ క్రమంలో రవీంద్రవర్మ తలపై బండరాయితో మోది హత్య చేసి సెల్ ఫోన్, బ్యాగ్ ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. మరుసటి రోజున ఉదయం జాతీయ రహదారి వద్ద గుర్తు వాహనం ఢీకొని రవీంద్ర వర్మ చనిపోయినట్లు స్థానికుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి సెల్ ఫోన్ ఎక్కడ ఉందని ఆరా తీశారు. చివరకు ఫోన్ ను కనుక్కోవడంతో అసలు విషయం బయటపడింది.

మెట్ పల్లికి చెందిన ఒకరు, కామారెడ్డికి చెందిన ఇద్దరు యువకులు రవీంద్రవర్మను హత్య చేసినట్లు నిర్ధారించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.