ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ పొందడం గొప్ప విషయం
. . . పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళు కార్యక్రమం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ శాఖలో పని చేస్తూ ఎస్.సంతోష్ రెడ్డి, వి.సాయన్ రావు, జలగం చంద్రశేఖర్ రావు, వి.ఎన్. సత్యనారాయణ, ఎం.డి. తజ్ముల్ అహ్మద్, ఏ.శంకర్...