Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 5:31 pm Posted by : ramakrishna

ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ పొందడం గొప్ప విషయం

. . . పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళు కార్యక్రమం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. పోలీస్ శాఖలో పని చేస్తూ ఎస్.సంతోష్ రెడ్డి, వి.సాయన్ రావు, జలగం చంద్రశేఖర్ రావు, వి.ఎన్. సత్యనారాయణ, ఎం.డి. తజ్ముల్ అహ్మద్, ఏ.శంకర్ లు ఏప్రిల్ 30 న పదవి విరమణ పొందారు.

It's a great thing to retire without any remarks.
It’s a great thing to retire without any remarks.

వీరి పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. వీరికి శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు (జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించారు.

It's a great thing to retire without any remarks.
It’s a great thing to retire without any remarks.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మీరు పోలీస్ డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.

It's a great thing to retire without any remarks.
It’s a great thing to retire without any remarks.

ఈ వీడ్కోళ్లు సందర్భంగా అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, అదనపు డీ.సీ.పీ (ఏ.ఆర్) రామ్ చందర్రావ్, హోంగార్డ్స్ ఏ.సి.పి కె. దీపక్ చంద్ర, ఆఫీస్ సూపర్డెంట్లు శంకర్, ఎ.జగతి, ఏ.సి.పి శ్రీశైలం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ రెడ్డి, రిజర్వు ఇన్స్ పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్, (ఎం.టీ.ఓ) ఎస్.శేఖర్ బాబు, (వెల్ఫేర్ /హోంగార్డ్స్) సతీష్, పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.