Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 9:41 pm Posted by : ramakrishna

బెజ్జోరా ఆలయంలో ఇటలీ ఆర్మీ బ్యాడ్జ్ ల లభ్యం

  • చరిత్ర పరిశోధకుడు కంకణాల రాజేశ్వర్

 

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బెజ్జోరా గ్రామ బుజ్జ మహాదేవి ఆలయంలో ఇటలీ ఆర్మీకి చెందిన బ్యాడ్జ్ లు లభ్యమైనట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు, చరిత్ర పరిశోధకుడు, కవి కంకణాల రాజేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బుజ్జ మహాదేవి ఆలయ ధర్మకర్త జంగం రాజేశ్వర్ ఆహ్వానం మేరకు తను ఆలయాన్ని సందర్శించగా ఆలయంలో ఒక మూలన రెండు బ్యాడ్జిలు సందర్శనార్థం పెట్టి ఉన్నాయని అన్నారు.వాటి ఫోటోలను తీసి పరిశోధనార్థం కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామాజు హర గోపాల్

Italian Army badges found in Bezzora temple

పంపడంతో వాటిని పరిశీలించి, పరిశోధించి అవి ఇటలీ దేశానికి చెందిన ఆర్మీ కెప్టెన్ల బ్యాడ్జ్ లుగా గుర్తించి తనకు తెలియజేశారని తెలిపారు. వాటి మొదటి బ్యాడ్జి పైన ఇటలీయన్ కోలోనియల్ హెల్మెంట్ (ఆర్డినరీ రేజిమెంట్ హెల్మెంట్)గా,రెండవ బ్యాడ్జ్ పైన(ఇటలీ, ఇటలీయాన్ ఆర్మీ కావాలిరీ కాప్ బ్యాడ్జ్)గా గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ బ్యాడ్జిలు రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటివని, ఈ బ్యాడ్జ్ లు అప్పట్లో సైనికులు ధరించేవారని

Italian Army badges found in Bezzora temple

అన్నారు. ఈ ఆర్మీ బ్యాడ్జిలు ఈ ఆలయంలో ఎందుకు ఉంచారు, అవి అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ బ్యాడ్జిలు ఇక్కడ భద్రాపర్చడం ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ బ్యాడ్జిలను తెలంగాణ ప్రభుత్వం ఆర్కియాళోజి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మ్యూజీయంలో భద్రాపర్చాలని కంకణాల ప్రభుత్వాన్ని కోరారు.

Italian Army badges found in Bezzora temple