Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 8:51 pm Posted by : ramakrishna

బండి సంజయ్ కేంద్ర మంత్రి గా కొనసాగితే దేశానికే అవమానకరం

 

. . . కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయకుంటే విచారణ సజావుగా జరగదు

 

. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగటం తెలంగాణకే కాదు దేశానికే అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో ఆదివారం జరిగిన ‘మన బూత్ – మన బాధ్యత’ అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి భేటీ బచావో.. బేటి పడావో అంటాడు.. కానీ భారతదేశంలో మొట్ట మొదటి సారి ఓ కేంద్ర మంత్రి కొడుకు మీద లుక్ అవుట్ నోటిసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయకుంటే విచారణ సజావుగా జరగదని, మైనర్ బాలికను అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకు అయితే, బాధితుకాలి తల్లి దండ్రులను స్వయంగా కేంద్ర మంత్రి భయపెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కలిసి హనీ ట్రాప్ అని మీడియాని మనీ ట్రాప్ లో వేశారని ఎద్దేవా చేశారు. అలాగే అధికాంరలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆయనన్నారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గమని తెలిపారు. అలా జరగాలంటే ఇప్పటినుంచే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యానికి నిరసనగా త్వరలో భారీ ధర్నా కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

 

It would be a disgrace to the country if Bandi Sanjay continues as a Union Minister.