Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 6:30 pm Posted by : ramakrishna

మారుతి సుజుకి లో ఆవిష్కృతమైన డిజైర్ కార్ ను ఆవిష్కరించిన నగర మేయర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

నిజామాబాద్ నగర శివారులోని వరుణ్ మోటార్స్ లో గురువారం మారుతి సుజుకి కంపెనీవారు నూతనంగా తయారుచేసిన డిజైర్ ఐకానిక్ కారును నగర మేయర్ దండు నీటు కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆల్ ఇండియాలోనే నెంబర్ వన్ డీలర్ అయిన వరుణ్ మోటార్స్ లో గ్లోబల్ ఎండ్ క్యాప్ 5 స్టార్ రేటింగ్ లో వచ్చిన న్యూ డాజలింగ్ డిజైర్ కార్ లాంచ్ చేయడం సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు. హైదరాబాద్ లాంటి మహా నగరాలకు బీటుగా నిజామాబాద్ లో కూడా కార్ల షో రూమ్ లో ఏర్పాటు కావడం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా మొదటి మూడుకారులని ముగ్గురు వ్యక్తులకు తన చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు.ఇప్పటివరకు 27 లక్షలకు పైగా సంతోషకరమైన కస్టమర్ల యొక్క ప్రేమను డిజైర్ కారు అందుకుందని, మరో కొత్త నాలుగు జెన్ డిజైర్ సరికొత్త జడ్ సిరీస్ ఇంజన్ తో వస్తుందన్నారు. ఈ కారు నడపడంలో సరదాని ఇస్తుండడంతో పాటు నీటి తరానికి నిచ్చే విధంగా కొత్త ఇందులో రూపొందించడం జరగడం అభినందనీయమని అన్నారు. ఎన్నేళ్లు గడిచిన ఎన్ని సంవత్సరాలు గడిచిన మారుతి సుజుకి కి ఉన్న పేరు తరగతి ఇచ్చారు. అలాగే ఈ కార్లు మరో ప్రత్యేకత వైర్లెస్ చార్జర్ తో పాటు, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ని కలిగి ఉండటం ఉంటుందన్నారు. కారు యొక్క ప్రారంభ ధర6.78 లక్షల నుండి9.68 లక్షల వరకు కలిగి ఉంటుందన్నారు. కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ జనరల్ మేనేజర్ ఎన్వి రమణ గుప్తా, ఏజీఎం ఎండల సుమన్, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

It was the mayor of the city who launched the Dzire car, which was launched in Maruti Suzuki