Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2025, 6:15 pm Posted by : ramakrishna

ఎస్సీ వర్గీకరణ అమలుకు కదం తొక్కిన మాదిగలు

  • 200 దప్పులు,  4వేల మందితో భారీ ర్యాలీ
  • తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను అమలు చేయాలన్న మాదిగ ఐక్య వేదిక పిలుపు మేరకు భీమ్ గల్ మండల మాదిగలు కదం తొక్కారు. ఎస్సీ ఏ, బీ, సీ, డీ వర్గీకరణను వెంటనే చేపట్టాలన్న డిమాండ్ తో 200 దప్పులు, 4వేల మంది మాదిగలు సోమవారం పట్టణం లో భారీ ర్యాలీని నిర్వహించారు. డా. జగజీవన్ రామ్, డా. అంబేద్కర్ విగ్రహాలకు ఐక్య వేదిక పెద్దలు, కుల సంఘ పెద్దలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.మాదిగ ఐక్య వేదిక గత 30 ఏళ్లుగా చేస్తున్న ధర్మ యుద్ధంకు ముగింపు పలకండి అని నినాదాలు చేస్తూ డాక్టర్. జగజీవన్ రామ్ విగ్రహం నుండి డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. మాదిగల రాజ్యాంగబద్ధమైన హక్కు సామాజిక న్యాయమైన రిజర్వేషన్లైనా ఎస్సీ వర్గీకరణను సత్వరమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్ గల్ మాదిగ దండోరా జేఏసీ ప్రెసిడెంట్ గడాల ప్రసాద్, నర్సయ్య, యోనా, రతన్ రాజ్, రాజేందర్, జనార్దన్, రాజేందర్, కృష్ణ, రాజేష్, సంతోష్, నరేష్, శీను, సీ. హెచ్ గణేష్, సీ. హెచ్ గంగాధర్, జెజె నర్సయ్య లు సీనియర్ దళిత జాతి నాయకులు,దళిత యువజన సంఘాల నాయకులు, సభ్యులు, దళిత మహిళా సంఘ నాయకులు,సభ్యులు, దళిత విద్యార్థిని, విద్యార్ధి సంఘ నాయకులు, సభ్యులు, కుల సంఘాల పెద్ద మనుషులు, సభ్యులు పాల్గొన్నారు.

It was the Madigalas who stood up for the implementation of SC classification