Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:26 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ నేతల వల్లనే బీజేపీ గెలుపు మరింత సునాయాసం

 

. . . రాహుల్ గాంధీ కన్నా రేవంత్ నయం

. . . పీసీసీ చీఫ్ కు కామన్ సెన్స్ లేదు . . . పరిపాలనపై అవగాహన లేదు

. . . కవిత ఔట్ డేటెడ్ పర్సన్

. . . నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి

నిజామాబాద్, బతుకమ్మ :

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి, జిల్లా స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ వల్లనే బీజేపీ గెలుపు మరింత సునాయాసంగా జరుగుతుందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ వచ్చే  ఎన్నికల్లో బీజేపీదే విజయమని, మరోసారి మోడి ప్రధాని కావడం ఖాయమని ప్రజల గుండెల్లో నిలిచిన వారే నిజమైన నాయకులని మొఖాలు చూస్తే ఓట్లు పడవన్నారు. రాహుల్ గాంధీ కంటే రేవంత్ రెడ్డే నయమని కుండబద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి చర్యలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వన్యప్రాణులను తరిమికొట్టారన్నారు. లక్షన్నర కోట్ల విలువ చేసే యూనివర్సిటీ భూములను దోచుకునేందుకే  రేవంత్ ప్లాన్ చేశాడన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కామన్ సెన్స్ లేదని, పరిపాలనపై అవగాహన లేదన్నారు. కవిత ఔట్ డేటెడ్ పర్సన్ అని కవిత ఏ టాక్స్ వల్లనే మాదవనగర్ కాంట్రాక్టర్లు పరిపోయారని అందువల్లనే ఆర్ వోబి ఆలస్యం అయిందని అన్నారు. కేసీఆర్ ది ఫాంహౌజ్ పాలన అని మరోసారి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకపోవడం వల్లే జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో మోదీ ఫోటో పెట్టాల్సిందేనన్నారు. 22ఏ కారణంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను… రేవంత్ వెంటనే అందులోంచి తొలగించాలి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

. . . రేపు మోడికి మంచి ఆయుష్షు ఇవ్వాలని దీపం వెలిగించి ప్రార్థిద్దాం

నరేంద్ర మోది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి.. మోది ప్రపంచ స్థాయి నేత ,మోది అందరికి స్ఫూర్తి దాత.. మోది సిద్దాంతాలు ఎందరినో ఆకర్షిస్తాయని ఎంపీ అర్వింద్ అన్నారు. మోదీ జన్మదినం సందర్బంగా సంకల్ప దివస్ పేరుతో నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా గురువారం (ఈ నెల 17న) సాయంకాలం అందరూ దీపం వెలిగించి ఆయనకు మంచి ఆయుష్షు ఇవ్వాలని అందరం ప్రార్తిద్దామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గోపిడి స్రవంతిరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, గద్దె భూమన్న,  కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.