బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హైదరాబాద్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. స్థానిక ఎన్నికలపై హై కోర్టు స్టే ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ వద్ద, పార్లమెంట్ లో అడ్డుకున్నది బిజెపి అయితే కోర్టులో కేసు వేసి అడ్డుకున్నది బిఆర్ఎస్ అని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం తరపున మేం బలమైన వాదనాలు వినిపించామని,...