ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలి
ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వినతి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామబాద్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి వినతిపత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగాప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, నిజామబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా మార్చడం ద్వారా నిజామబాద్ జిల్లా...