Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2025, 4:49 pm Posted by : ramakrishna

నీటి సమస్య లేకుండా చూడాలి

  • నిరుపయోగంగా నీటి తొట్టీలు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం లక్షలు నిధులు వేచ్చించి నిర్మించిన నీటితొట్టీ లు నిరుపయోగంగా మారాయి అని గ్రామస్తులు అంటున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్  వెల్లుట్ల గ్రామ నీటితొట్టిల ను పరిశీలించారు. పశువుల నీటి తొట్టె నిర్వహణ సక్రమంగా లేక శిథిలావస్థ తో పాటు చెత్త కుండీ నీ  తలపిస్తున్నాయి. దీంతో వెల్లుట్ల గ్రామంలో పశువులను నీటి తొట్లల్లో నీరులేక నీటి కోసం చెరువులకో, లేక బోరుబావుల వద్దకో తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితున్నాయి.  ప్రభుత్వం మూగ జీవాలకు తాగునీరు అందించేందుకు శిధిలావస్థలో వున్న నీటి తొట్టె లను శుభ్రం చేసి నీటినీ నింపి గ్రామ రైతుల పశువుల కు నీటిసౌకర్యం కల్పించాలని శిథిలావస్థకుచేరిన వాటిని నీటితొట్లలో పిచ్చిమొక్క లు, చెత్తచెదారంతో నిండి నిరుపయోగంగా ఉన్న వాటిని శుభ్రం చేయాలని అధికారులతో చారవాని లో మాట్లాడారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టు కుని సంబంధిత అధికారులు తమ గ్రామాలలో శిథి లావస్థలో వున్న నీటి తొట్టెల ను వెంటనే బాగుచేయాలనీ కోరారు.

It should be seen without water problem