నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రైళ్లలో చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూడాలని రైల్వే ఎస్పీ శ్రీనివాస్ రావు సిబ్బందికి సూచించారు. నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట సీఐ(హైదరాబాద్) ఏ శ్రీనివాస్ ఉన్నారు.
