తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో త్రాగునీరు, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే వేసవి కాలంలో పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతీరోజూ నిరంతర నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన పక్షంలో బోర్ వెల్స్...