. . . పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి
నిజామాబాద్, బతుకమ్మ:
అమరవీరుల కుటుంబాలను రాజకీయాల కు వాడుకోవడం దుర్మార్గం. బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ లు తెలంగాణ ను రాజకీయాల కు వాడుతున్నారు అని రుజువైందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ… రేవంత్ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన లేదు, రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా జై తెలంగాణ అనలేదు అన్నారు. కేసీఆర్ ప్రాణమిత్రుడు ఉత్తమ్ కుమార్ ను గెలిపించేందుకు అమరుడు శ్రీకాంతాచారి తల్లి కి హుజుర్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ ను గెలిపించేందుకు ఆనాడు శంకరమ్మ ను బలి చేశారు అని, కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిన కేసీఆర్ శంకరమ్మ కు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ పాలన లో కాళేశ్వరం డిజైన్ లో లోపాలు ఉంటే తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రిపేర్ చేయడంలో విఫలమైంది అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టిస్తుంది అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ బి ఆర్ ఎస్ లు కొట్టుకుపోతాయి ,అమిత్ షా చెప్పినట్లు బీజేపీ రుచి తెలంగాణకు చూపిస్తాం అన్నారు. కేటీఆర్ గర్జన సభలు కాదు తొందరపాటు చర్య అని ఎంపీ అర్వింద్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని, తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

బిజేపి చీఫ్ నితిన్ నబిన్ పర్యటన రద్దు… డిసెంబర్ లో జిల్లాకు అమిత్ షా
భారతీయ జనతా పార్టీ చీఫ్ నితిన్ నబిన్ ఈ నెల 23 నాటి నిజామాబాద్ పర్యటన రద్దయిందని ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఓక్కటే రోజు కార్యక్రమాల వలన ఇబ్బందుల కారణంగా నిజామాబాద్ లో నితిన్ నబిన్ రావడం కుదరడం లేదన్నారు. ఆయన కరీం నగర్ లో పర్యటిస్తారని తెలిపారు. డిసెంబర్ మాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుంద ని బిజేపి నేత సునీల్ బన్సాల్ ఖరారు చేశారన్నారు.