Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2025, 2:29 pm Posted by : ramakrishna

ఉద్యమించాల్సిన బాధ్యత మాదిగ విద్యార్థులదే

  • ఎంఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి మాదిగ

కామారెడ్డి, బతుకమ్మ : భారత అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్న ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ, మాదిగ ఉప కులాలను మోసం చేస్తున్నాడని, ఆ మోసకారి రేవంత్ ప్రభుత్వంపై ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మాదిగ విద్యార్థులు యుద్ధ సైనికులై ఉద్యమించాలని ఎంఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తూ రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే టీచర్ ఉద్యోగ నియామకాల్లో మాదిగ మాదిగ ఉపకులాలు తీవ్రంగా నష్టపోయాయని మరల గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ,  హాస్టల్స్ వార్డెన్ తదితర ఇతర ఉద్యోగ నియామకాల పరీక్షలు నిర్వహిస్తూ ఎస్సి కోటాలో ఉన్న ఉద్యోగాలను మాదిగలకు దక్కకుండా మాలలకు దోచిపెట్టే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.  మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు ద్రోహం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం పై మాదిగ విద్యార్థులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని మన ఉద్యోగాల కోసం హక్కుల కోసం భవిష్యత్తు కోసం యుద్ధ సైనికులుగా మారి వర్గీకరణను అమలు చేయించుకోవాలని కోరారు. ఎస్సీ వర్గీకరణను తక్షణమే రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ గారు తీసుకునే ఉద్యమ కార్యాచరణకి విద్యార్థులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగ నియామకాల పరీక్షలు నిర్వహిస్తూ ఎస్సి కోటాలో ఉన్న ఉద్యోగాలను మాదిగలకు దక్కకుండా మాలలకు దోచిపెట్టే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.  మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు ద్రోహం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం పై మాదిగ విద్యార్థులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని మన ఉద్యోగాల కోసం హక్కుల కోసం భవిష్యత్తు కోసం యుద్ధ సైనికులుగా మారి వర్గీకరణను అమలు చేయించుకోవాలని కోరారు. ఎస్సీ వర్గీకరణను తక్షణమే రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ గారు తీసుకునే ఉద్యమ కార్యాచరణకి విద్యార్థులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.