బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని అహ్మద్ బి.ఎడ్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ప్రచురించిన పర్యావరణ పరిరక్షణ పోస్టర్లను శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హనీఫ్ పాషా, కళాశాల సిబ్బంది ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన మెలకువలను, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అనేది ప్రభుత్వం, నిర్దిష్ట సంస్థల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.