Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2024, 5:26 pm Posted by : ramakrishna

ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఐదవ వార్షికోత్సవం

  – మొక్కులు తీర్చుకున్న ఆలూరు గౌడ సంఘ సభ్యులు

ఆర్మూర్, బతుకమ్మ : ఆలూరు మండల కేంద్రంలోని గౌడ కుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి ఐదవ వార్షికోత్సవ వేడుకలను ఆలూరు గౌడ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి రణదీర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక హోమము, కళ్యాణ అభిషేకము అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అలంకరించారు. ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు.ఇట్టి వేడుకలకు జిల్లా గౌడ యువజన సంఘ సభ్యులు హాజరైనారు. ఆలూరు గౌడ సంఘం తరఫున గౌడ సంఘ సభ్యులు ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో ఆలూరు గౌడ సంఘ పెద్దలు గోపి గౌడ్, మధు గౌడ్, మహేష్ గౌడ్, నరేష్ గౌడ్, అర్జున్ గౌడ్,రంజిత్ గౌడ్,సురేష్ గౌడ్ ,సుదర్శన్ గౌడ్,గౌడ కులస్తులు పాల్గొన్నారు.

It is the fifth anniversary of Renuka Ellamma's mother