Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 4:47 pm Posted by : ramakrishna

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత

 

. . . నందిపేట్ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం

 

నందిపేట్, బతుకమ్మ :

 

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని నందిపేట్ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం అన్నారు.  నందిపేట్ మండల కేంద్రం లో గ్రామ పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రధాన కూడలిల వద్ద శుక్రవారం చెత్త డ్రమ్ములను ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్త డ్రమ్ములలోనే వేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామ్‌చందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్, వార్డు సభ్యులు గంగాధర్, చింత శ్రీనివాస్, అన్వేష్ గౌడ్, పెట్ల శ్రీనివాస్, రవి, భాస్కర్, చేపూరు వినిత్, సెంట్రింగ్ గంగన్న పాల్గొన్నారు.

 

It is our responsibility to keep the village clean.