కులగణన వివరాలతో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం లేదు.. మండలిలో ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, బతుకమ్మ :  కాంగ్రెస్ పార్టీ కులగణన వివరాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని  చెప్పడం లేదని మండలిలో ఎమ్మెల్సీ కవిత నిలదీశారు.  ప్రభుత్వం కులగణన నివేదికను మంగళవారం శాసనసభ, శాసన మండలిలో  ప్రవేశపెట్టి చర్చలు జరుపుతోంది. ఈసందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. రెండు రోజుల కిందట మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పిన కులగణన వివరాలనే ఇప్పుడు మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పి మమ అనిపించారని కవిత విమర్శలు గుప్పించారు. [video width="488" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/02/mlc-kavitha-mandali-video.mp4"][/video]