Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 3:02 pm Posted by : ramakrishna

పేదలపై భారం మోపడం సరికాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తూ పేదలపై భారం మోపడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో బుధవారం నిరసన తెలిపారు.

సిలిండర్ ను పేదలు మోయలేని భారంగా పేర్కొంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. గ్యాస్ పై 50 రూపాయలు, పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు పెంచడం అన్యాయమని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు కేవలం 400 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఇప్పుడు వెయ్యి రూపాయలకు పైగా ధర పెరిగిందని అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.భూమయ్య, సిపిఐ జిల్లా నాయకులు వై రాజిరెడ్డి, కె రాజన్న, ఏ రాజేశ్వర్, పి హనుమాన్లు, రాందాస్, బి రఘురాం, రంజిత్, అంజలి, రమేశ్ పాల్గొన్నారు.

It is not right to burden the poor.