Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 4:21 pm Posted by : ramakrishna

పేద ప్రజలకు భారాలు మోపడం సరికాదు

 

. . . పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా డిమాండ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రెక్కాడితే కానీ డొక్క నిండని పేద ప్రజలకు భారాలు మోపడం సరికాదని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని బుధవారం నాగారం గౌషాల వద్ద కట్టెల పోయి తో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  మన దేశ ప్రధాని మహిళలందరికీ గొప్ప బహుమతి ఇచ్చారని, అదే గ్యాస్ ధర పెంచడమని అన్నారు. ఇప్పటికే చేసిన పనికి వేతనాలు లేక, చేతినిండా కూలి పని దొరకక మధ్యతరగతి కుటుంబాలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. యుద్దాల కారణంగా నిత్యవసర వంటగ్యాస్ ధరలు పెంచడం సరి కాదన్నరు. ఏం చేస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారం పడకుండా ఉంటుందో ఆలోచించి ప్రజల బారాన్ని తగ్గించే విధంగా కృషి చేయడం మానేసి, ఏం చేస్తే నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరగొట్టొచ్చని చూస్తూన్నారని పేర్కొన్నారు. బడా పెట్టుబడిదారుల ఆదాయాలు పెంచే విధంగా లాభాలు వచ్చే విధంగా మన ప్రధాని కృషి చేస్తున్నారని, ఇప్పుడైనా పేద, మధ్యతరగతి మహిళలు ఆలోచించి పెంచిన గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలను తగ్గించడం కోసం ఐద్వా చేస్తున్న పోరాటాల్లో కలిసి రావాలన్నారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు శ్రీదేవి, సంగీత, యశోద, స్థానికులు భారతమ్మ, విజయ, పంచు బాయ్, భాగ్య దొందుబాయ్, అనిత, సునీత తదితరులు పాల్గొన్నారు.