Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 9:06 pm Posted by : ramakrishna

కేంద్రమంత్రి రిజైన్ చేస్తే సరిపోదు

 

. . . భవిష్యత్ లో పేపర్ లీకేజీలు జరగకుండా సంస్కరణలు తేవాలి

 

. . . కంటితుడుపు చర్యలు కాదు విద్యార్థులకు నిజమైన న్యాయం జరగాలి

 

. . . విద్యార్థులపై దమనకాండకు దిగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

 

. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఎట్టకేలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయటంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. విద్యార్థుల ప్రొటెస్ట్ కారణంగానే కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం కేంద్ర మంత్రి రిజైన్ చేస్తే సరిపోదని కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు. పేపర్ లీకేజీ సంక్షోభాలకు ఇది ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. కేవలం బీజేపీకి జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే కేంద్రమంత్రి తో రాజీనామా చేయించారని చెప్పారు. విద్యార్థులకు నిజంగా న్యాయం జరగాలంటే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థాగత సంస్కరణల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందన్నారు. యుపిఎస్ సి తరహాలోనే ఎన్ టిఎ కు కూడా చట్టబద్దమైన స్వతంత్రత ఇవ్వాలన్నారు. భవిష్యత్ లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాలను తీసుకురావాలని కవిత కోరారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. వీటన్నింటికి తోడు ఈనెల 20న విద్యార్థులపై పాశవికంగా పోలీసులు జరిపిన దమనకాండపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. లాఠీఛార్జ్ కు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. అప్పుడు మాత్రమే విద్యార్థులకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. కేవలం కేంద్రమంత్రితో రాజీనామా చేయించి కంటితుడుపు చర్యలు చేపడతామంటే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు.