ఉద్యమ ప్రతీకలను అవమానించడం తగదు

హైదరాబాద్, బతుకమ్మ: ఉద్యమ ప్రతీకలను అవమానించడం తగదని, ప్రభుత్వం తెలంగాణ తల్లిని మార్చి అందరి మనస్సులను నొప్పించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భవన్  ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పాలు, పంచా మృతంతో అభిషేకం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ యువత, ఉద్యమకారులు కలిసి పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని, ఉద్యమకారుల జోలికి వచ్చిన, అవమానించిన వారెవరూ బాగుపడలేదన్నారు. ఆ విషయం మీ గురువు చంద్రబాబుకు బాగా తెలుసని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్...