Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 6:05 pm Posted by : ramakrishna

తరుగు, ఉతార్ లతో రైతులను నష్టపరచడం తగదు

  • ధాన్యం లోడు రైస్మిల్ కి వెళ్తే దాని పూర్తి బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే
  • గత మాదిరిగా ఉన్న తరుగును కొనసాగించాలి
  • కోటగిరిలో  రెండు గంటల పాటు రోడ్డుపైన ధర్నా చేసిన రైతులు
  • రైతులు, మిల్లర్లు, సొసైటీ వారితో సమావేశం ఏర్పరుస్తానన్న ఎమ్మార్వో

 

బతుకమ్మ, కోటగిరి : ప్రకృతి ప్రకోపానికి గురైన పంట ల నుండి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక దిగులుగా ఉన్న రైతులపై రైస్ మిల్లర్లు,కొనుగోలు కేంద్రాల నిర్వహకులు,అధి కారులు ఉదాసీనత చూపించడం మానేసి తరుగు,ఉతార్ పేరున పలు రకాల ఇబ్బందులకు గురి చేయడం తగునా అని కోటగిరి మండల రైతులు ప్రశ్నించారు.గురువారం కోటగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా రైతుల ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ రోడ్డుపై రెండు గంటల పాటు బైఠాయించి ధర్నా చేస్తూ పురుగు మందు డబ్బులతో రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్వో గంగాధర్ వెంటనే స్పందించి రైస్ మిల్లర్లు,కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు,సహకార సంఘం క్లస్టర్ అధికారు లతో శుక్రవారం నాడు సమావేశం ఏర్పాటు చేసి రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలపై చర్చలు సఫలీకృతం అయ్యేవి ధంగా కృషి చేస్తానని అన్నారు.గతమాదిరిగా తరుగు ఎలా తీసారో అలాగే కాటాలు కొనసాగించాలని.ఏ ఒక్క రైతు చింతించవద్దని ఆయన హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.ప్రకృతి ప్రకోపానికి పండిన పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడి రాక ఆవేదనలో ఉన్న రైతుల నుండి క్వింటాల్కు మూడు నుంచి నాలుగు కిలోలు తరుగు కొనుగోలు కేంద్రాలు,రైస్ మిల్లర్లు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ప్రస్తుతం వరి ధాన్యం ఎకరాని కి 20 బస్తాలు వస్తున్న తరుణంలో రైతుల నుండి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు,రైస్ మిల్లర్లు ఇంత మొత్తంలో తరుగు ఆశించడం మాకు తీరని అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రాలలో కాటా అయినా రైతుల ధాన్యం రైస్ మిల్కు చేరితే అక్కడ మిల్లర్లు ఉతార్ పేరున 5 నుండి 6 కిలోల తరుగు ఆశించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.రైతుల ధాన్యం లోడు రైస్మిల్ కి వెళ్తే దాని పూర్తి బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల చూసుకోవాలే తప్ప రైతులకు ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించారు.గతంలో క్వింటాల్ వరి ధాన్యానికి ఖరీఫ్ సీజన్లో 1 కిలో,రబి సీజన్లో 1.5 కిలోల తరుగును అమలు చేసేవారని.ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో ఎందుచేత కిలోన్నర తీసుకుంటున్నారని ప్రశ్నించా రు.వెంటనే జిల్లా అధికారులు స్పందించి మండలాల వారిగా ఇటు రైతులు అటు రైస్ మిల్లర్ తో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలన్నారు.ఈ ధర్నాలో సాధక్,ఔగి ర్ రావ్ దేశాయ్,వల్లెపల్లి శ్రీనివాస్,తేల్ల రవి కుమార్,ఏము ల నవీన్,మామిడి శ్రీనివాస్,చిత్తరి శ్రీనివాస్,కప్ప సంతోష్, రమణ,వాసు,బ్యాగరి మారుతి,అస్కూల్ రవి,ఎడ్డెడి సాయిలు,మామిడి అశోక్,మామిడి కిషన్, చిన్న అరవింద్,పి.సాయిలు, పి.సతీష్,వడ్ల శ్యామ్,రాజా గౌడ్,రైతులు పాల్గొన్నారు.