- కామారెడ్డిలో దీక్షా దివాస్ లో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
కామారెడ్డి, బతుకమ్మ : కోట్లాది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఆయన ఆనవాళ్లను తీసివేయడం ఎవరి తరం కాదని దీక్షా దివస్ కామారెడ్డి ఇంచార్జి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి, అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను పూలమాలలు వేసిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి అంజలి ఘటించి, అనంతరం సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో అమరులైన గడ్డ కామారెడ్డి గడ్డ అని, ఎన్నో త్యాగాలు చేసిన ప్రాంతం కామారెడ్డి ప్రాంతమని అన్నారు. ఇప్పుడున్న తరానికి తెలంగాణా చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ తొలి విడుత 1959 వ సంవత్సరంలో 369 మంది అమరులైనా తెలంగాణ రాష్ట్రం సిద్గించలేదని అన్నారు. కవితను ఈడి కేసులో నరేంద్ర మోడీ జైలుకు పంపినా కెసిఅర్ లొంగలేదని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో మూడున్నర కోట్ల ప్రజలు జరుపునే పండుగ ఈ దీక్షా దివస్ అని అన్నారు. ప్రకృతితో పోటీపడి నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. కేటీఆర్ పోరాటాల ఫలితంగా 100 కోట్ల రాష్ట్ర ఆదాయం అదానీ పాలు కాకుండా అడ్డుకున్నామని అన్నారు. మళ్ళీ రాష్ట్ర ఆదాయం కొల్లగొట్టేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు చూస్తున్నాయని, ప్రతి కార్యకర్త మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్దన్ మాట్లాడుతూ కేసీఆర్ మలి విడత తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతోనే కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలుకు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులను అనుభవించి వెల్లిపోయి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారిని పార్టీలోకి తీసుకోవద్దన్నారు. ప్రతి గ్రామంలో జరిగిన డెవలప్ మెంట్ కాంగ్రెస్, బీజేపీలకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ దీక్షా దివాస్ లో మాజీ జడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభా రాజు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ముజిబుద్దీన్, కామారెడ్డి జిల్లాలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
