Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2024, 4:06 pm Posted by : ramakrishna

మేధావులను తయారు చేసేది గురువే

బతుకమ్మ, మోర్తాడ్: సమాజంలో శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను, డాక్టర్లను, పారిశ్రామికవేత్తలను, రాజకీయ నాయకులను తయారు చేసేది గురువుకే సాధ్యమని ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ రావు అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ఉపాధ్యాయుడి నుంచి దేశ అధ్యక్షుడిగా ఎదిగారని గుర్తు చేశారు. పాలెం జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులను విద్యార్థులు పూలమాలలతో సత్కరించడం జరిగినది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్ కుమార్, చంద్రశేఖర్, నరసింహ స్వామి, త్రివేణి మేడం, జయశ్రీ మేడం, రాజేశ్వరి గారు పాల్గొన్నారు.