కార్యకర్తలే జిల్లా అధ్యక్షున్ని ఎన్నుకోవడం సంతోషకరం
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి డిచ్‌పల్లి,ధర్పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికలో కార్యకర్తల అభిప్రాయ సేకరణలో భాగంగా డిచ్‌పల్లి,ధర్పల్లి ల లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లలో నిర్వహించిన “సంఘటన్ శ్రీజన్ అభియాన్” సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ప్రజాస్వామ్య విధానంలో కార్యకర్తల చేతనే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఎంతో సంతోషకరం. ఇతర పార్టీల్లోలాగా పై అధికారుల నిర్ణయం కాదు, కార్యకర్తలే తామే నాయకుడిని ఎన్నుకోవడం...