. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
బిచ్కుంద, బతుకమ్మ :
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి రావడం సంతోషకరమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కిడ్స్ పాఠశాల ను ఎమ్మెల్యే గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, లైబ్రరీ, ఆట స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్కిడ్స్ పాఠశాల లాంటి ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం వల్ల విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పాఠశాల యాజమాన్యం చదువుతో పాటు క్రీడలు, కల్చరల్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించింది. పేద విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల ప్రజాప్రతినిధులు, ఆర్కిడ్స్ పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.