Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 5:54 pm Posted by : ramakrishna

దేశ స్వాతంత్య్ర విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

 

. . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా డే సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆదివారం ఆయన జెండా ఆవిష్కరించి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ పుస్తక ప్రదర్శనను, గాంధీజీ విగ్రహాలను మహేష్ కుమార్ గౌడ్ ఇతర నాయకులతో కలిసి సందర్శించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ అందించిన సేవలను, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకాటి శ్రీహరి, మహ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ యాదవ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవాదళ్ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా డే కార్యక్రమాలను నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

 

It is everyone's responsibility to uphold the values ​​of the country's independence.