Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 4:32 pm Posted by : ramakrishna

గోమాతలను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది

 

. . .  నిరాహార దీక్ష చేపట్టిన భజరంగ్ దళ్ నాయకులు

 

జుక్కల్, బతుకమ్మ

 

మన గోమాతలను రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని భజరంగ్ దళ్ సభ్యులు అన్నారు. గత 45 రోజుల నుండి జుక్కల్ మండల కేంద్రంలో గో మాతలు దొంగతనానికి గురి అవుతున్నాయని వారు పేర్కొన్నారు. గోమాతలను రక్షించాలని బుధవారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. గత 45 రోజుల్లో జుక్కల్ మండల కేంద్రంలో 7 ఆవులు, ఖండేబల్లార్ గ్రామంలో 2 ఆవులు దొంగతనానికి గురైనట్టు వారు తెలిపారు. గ్రామంలో ఉన్న నాయకులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని భజరంగ్ దళ్ సభ్యులు వాపోయారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓట్లు వేయాలని తిరుగుతారని, తర్వాత పట్టించుకోరని వారు పేర్కొన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో దొంగతనానికి గురైన ఆవులు దొరికేంత వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ నిరాహార దీక్షలో భజరంగ్ ధళ్ సభ్యలు మౌళి కృష్ణ గౌడ్, వినోద్ గౌడ్, మోతే విజయ్ పటేల, దిలీప్ కోటి తదితరులు పాల్గొన్నారు.