Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 5:10 pm Posted by : ramakrishna

మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ఆనందదాయకం

 

. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతం, ఇందిరా ప్రియదర్శిని కాలనీ లో నూతనంగా నిర్మించిన ఇందూర్ ఘడ్ జగదాంబ – సేవాలాల్ మహారాజ్ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందేందుకు దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జగదాంబ తల్లి, సేవాలాల్ మహారాజ్ కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

 

It is enjoyable to preserve our culture and traditions.

 

ఈ మహోత్సవ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య వైభవంగా నిర్వహించబడుతున్నాయి. మూడు రోజుల పాటు యాగశాల కార్యక్రమాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడగా, చివరి రోజు విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ఠ, పంచామృతాభిషేకం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, రమేష్, 42వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ శశాంక్ రెడ్డి,19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మి నారాయణ, 39 వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మురళి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతిరోజు భక్తులకు అన్నదానం కూడా నిర్వహించారు.

 

It is enjoyable to preserve our culture and traditions.