దుఃఖ నివారణకు మార్గం తెల్పింది బౌద్ధమే
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో గల ప్రఖ్యాత మోక్షనంద బుద్ద విహర్లో బుధవారం మఘ పౌర్ణమి పురస్కరించుకొని బుద్ధుడి ధమ్మపదం ప్రవచనాలు సాగాయి. మోక్షనందా బుద్ద విహార్ చీఫ్, తెలుగు నెలకు చెందిన ప్రఖ్యాత బౌద్ధ పండితులు భంతే ధమ్మరక్ఖిత తనదైన సరళ భాషలో ధమ్మపదంలోని అనిత్యవాదం, దుఃఖం, అనాత్మ అనే బుద్ధుడి బోధనల్ని ఉపాసకులకు అర్థమయ్యేటట్లు చక్కగా వివరించారు. "అనిత్యం" అనగా సంసారంలో ఏది కూడా శాశ్వతమైంది కాదని, ఉదాహరణకు చెట్టుకు కాసే పూత, కాయ, పండుగా మారి చివరికి కాలగర్భంలో...