Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 8:21 pm Posted by : ramakrishna

దుఃఖ నివారణకు మార్గం తెల్పింది బౌద్ధమే

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో గల ప్రఖ్యాత మోక్షనంద బుద్ద విహర్లో బుధవారం మఘ పౌర్ణమి పురస్కరించుకొని బుద్ధుడి ధమ్మపదం ప్రవచనాలు సాగాయి. మోక్షనందా బుద్ద విహార్ చీఫ్, తెలుగు నెలకు చెందిన ప్రఖ్యాత బౌద్ధ పండితులు భంతే ధమ్మరక్ఖిత తనదైన సరళ భాషలో ధమ్మపదంలోని అనిత్యవాదం, దుఃఖం, అనాత్మ అనే బుద్ధుడి బోధనల్ని ఉపాసకులకు అర్థమయ్యేటట్లు చక్కగా వివరించారు. “అనిత్యం” అనగా సంసారంలో ఏది కూడా శాశ్వతమైంది కాదని, ఉదాహరణకు చెట్టుకు కాసే పూత, కాయ, పండుగా మారి చివరికి కాలగర్భంలో ఆ వస్తువువు కల్సి పోతుంది. మానవ జీవితాలు కూడా అంతే. కావున అశాశ్వతమైన దానిని శాశ్వతం అనుకుంటే దుఃఖం సిద్ధిస్తుంది. దుఃఖానికి కారణం ఉంటుంది. కారణానికి మార్గం ఉంటుంది. అదే అష్టాంగ మార్గాన్ని భగవాన్ బుద్దుడు సామాన్య ప్రజలకు అమూల్యమైన తత్వం తెలియజేశారని భంతే గారు విశ్లేషించారు. తదుపరి మాఘ పౌర్ణమి విశిష్టతను తెల్పారు. ఆరంభంలో బుద్ద వందనం అనంతరం పారాయణంలో భాగంగా జ్ఞానోదయ ప్రవచనం చేశారు. గత 4నెలల నుంచి ధమ్మపదం సాగుతుందన్నారు. భగవాన్ భక్తులు వడ్ల నాగేందర్ ద్వారా హాజరైన ఉపాసకులకు అన్నదానం జర్పబడింది. ఈ కార్యక్రమంలో వివిధ ఊర్ల నుంచి మంచి సంఖ్యలో బుద్ధిస్టులు హాజరయ్యారు.

It is Buddhism that has shown the way to cure sorrow